పరిగిలో రైతుల దీక్ష భగ్నం

13-09-2026 | 09:49am

పట్టా భూముల జోలికి రావొద్దు

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన

కాడ్లాపూర్: వికారాబాద్ జిల్లా(Vikarabad District) పరిగిలో కాడ్లాపూర్ రైతుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి(MLA Rammohan Reddy) ప్రకటనకు నిరసనగా రైతులు దీక్ష చేపట్టారు. ఇండస్ట్రియల్ పార్కుకు(Industrial Park) భూములు ఇవ్వకున్న ఇచ్చినట్లు ప్రకటించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 160 ఎకరాల పట్టా భూముల జోలికి రావొద్దని రైతులు దీక్షకు దిగారు. నిరసన చేసుకోనివ్వాలంటూ రైతు ఎస్సై కాళ్లు పట్టుకున్నాడు. మహిళా రైతులు పోలీసుల వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కాడ్లాపూర్, రాపోలు రెండు గ్రామాల్లో 1,197 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేసింది. జీవనాధారమైన భూములు లాక్కొవద్దని రైతులు ఆందోళబాట పట్టారు. ఈ నిరసనలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు