మూగబోయిన ‘కత్వ’...
- శతాబ్దాల సహజ వనరులు శిథిలం
- కళ్ళముందే ఆయకట్టు ధ్వంసం
- ప్రశ్నించని యువత.. పట్టించుకోని ప్రజలు
- ఎండిన ఆయకట్టు బీడువారిన వందలాది ఎకరాలు
- నేలలో సారం ఉన్నా సాగుకు నోచుకోని దుస్థితి
- పాలకుల నిర్లక్ష్యం కనుమరుగైన పూర్వ వైభవం
- నిమ్మకు నీరెత్తిన ఇరిగేషన్ శాఖాధికారులు
రంగారెడ్డి బ్యూరో,సెప్టెంబర్ 22( విజయక్రాంతి): ఒకప్పుడు వందలాది ఎకరాలకు ప్రాణధారగా నిలిచి పల్లె ప్రజలకు కడుపునిండా అన్నం పెట్టిన పురాతన ‘కత్వలు(Ancient Katvalu)’ నేడు పాలకుల నిర్లక్ష్యం, గ్రామస్థుల మౌనం వ ల్ల నాశనమవుతున్నాయి. ఏ ప్రాజెక్టూ రా కుండానే, కేవలం ప్రజలు అధికారులు నాయకుల బాధ్యతారాహిత్యం వల్ల ఆ గ్రామం గత వైభవం జీవనాధారమైన నీటి సహజ వనరులను(Natural water resource) కళ్ళముందే కోల్పోతోంది. అదే రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) చేవెళ్ల నియోజకవర్గం(Chevella Constituency)లోని నవాబుపేట మండలం అక్నాపూర్ గ్రామం. నియోజకవర్గాల పునర్విభజన(Delimitation of constituencies)లో భా గంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న నవాబ్ పేట్ మండలం చేవెళ్ల నియోజకవర్గంలో కలిసింది.
ఇంజనీరింగ్ అద్భుతం...
నాటి పల్లె కల్పవల్లి....దాదాపు వంద సం వత్సరాల క్రితం, ఒక ఇంజనీర్ పారే వాగుపై(Flowing stream) రెండు అద్భుతమైన ’కత్వల’కు (చెక్డ్యామ్లు) రూపకల్పన చేశారు. ఊరి అంచున సర్పాలకారంలో (జిగ్-జాగ్) తవ్విన కాలువ ద్వారా కత్వల నీటిని సమర్థవంతంగా ఊరు పక్కనే ఉన్న వందల ఎకరాల భూమికి మల్లించి ఆ యకట్టుగా మార్చాడు.ఆ నీటితో వందలాది ఎకరాల్లో పంటలు పండి, గ్రామం ధాన్యరాశులతో అలరారింది. ఈ ఎగువ దిగువ కత్వలు పల్లె ప్రజలకు నిజమైన ‘కల్పవల్లి’గా మా రాయి. ఆయకట్టులో పండిన అన్నం తిన్న గ్రామస్తులకు అపారమైన విజ్ఞానం చేకూరింది.
కత్వ శిథిలమైంది....
ఈ కత్వల పుణ్యమా అని ఆనాడు లభించిన తిండితో గ్రామంలో చదువు వికసించిం ది. ‘కలం బలం’ పెరిగిన పల్లె బిడ్డలు ఒకరి తర్వాత ఒకరు ఉన్నత చదువులు చదివి, కొ లువుల వేటలో పట్టణాలకు విదేశాలకు సై తం పరుగులెత్తారు. అయితే విద్యావంతులై ఊరిని వదిలిన యువతరం, తమకు పునాది వేసిన కత్వల స్థితిని పూర్తిగా విస్మరించారు. కాలువ అక్కడక్కడ కబ్జాకు గురికావడంతో గలగల పారే కాలువ గొంతు నేడు మూగబోయింది. ఆయకట్టు ఎండిపోయి ఎలువ (మెట్ట) భూమిగా మారింది. ఊరి చుట్టూ దారి పొడవునా కనిపిస్తున్న నత్తగుల్లలు నేటి కి ఆ భూమి సారానికి సాక్ష్యాలుగా మిగిలా యి. నాయకత్వ లోపమో, ప్రజల్లో ప్రశ్నించని తత్వమో కానీ, ఒకనాటి పచ్చని ఊరు నేడు శరబంధమైంది.
‘నేను... నా కుటుంబం’ అనే స్వార్థం....
సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు వస్తే ఊ ళ్ళు, చారిత్రక కట్టడాలు మునిగిపోవడం స హజం. కానీ ఇక్కడ ఎలాంటి ప్రాజెక్టు రాకుండానే గత జ్ఞాపకాలు గంగలో కలిసిపోతున్నాయి. ‘తలాపున పారుతుంది గోదా రి... నీ సేను నీ సెలుక ఎడారి‘ అన్నట్లుగా గ్రా మంలో పరిస్థితి తయారైంది. ‘నా కుటుం బం బాగుంటే చాలు, ఊరు ఏమైతే నాకేం టి?‘ అన్న స్వార్థంతో ప్రజలు ఉద్యోగులు యువకులు నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కత్వలు ఏమయ్యాయి? కాలువ నీటి ప్రవాహాలు ఎక్కడ ఆగిపోయా యి? అని నిలదీసే నాథుడే కరువయ్యాడు.
యువతరం మౌనం వీడేనా? ప్రకృతి ప్రసాదించిన సహజ నీటి వనరులను కోల్పోతే, ఎంతటి మేధస్సు ఉన్నా తిరిగి సాధించలేమనే సత్యాన్ని గ్రహించి, గ్రామాన్ని కాపా డుకోవడానికి స్థానికులు, యువత తక్షణమే గొంతు విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉం ది. సమాజానికి చెడ్డవాళ్ళ వల్ల కలిగే నష్టం కంటే మేధావుల మౌనం వల్ల కలిగే నష్టమే ఎక్కువ విధ్వంసం సృష్టిస్తుందన్న విషయం విద్యావంతులు గుర్తేరగాలి. ఇప్పటికైనా స్థాని క నాయకులు,గ్రామ ప్రజలు సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే కత్వ పునర్నిర్మాణం చేసి పూర్వ వైభవాన్ని తేవాల్సిన బాధ్యత వారిపై ఉంది. పకృతి సిద్ధమైన సహజ వనరులే వెలకట్టలేని సిరిసంపదలని గుర్తెరుగాలి.