కవిత ఫైర్.. రేవంత్ సర్కార్‌పై అవినీతి ఆరోపణలు

12-09-2026 | 04:55pm
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)పై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీని సీఎం తన ప్రచారానికి వేదికగా మార్చుకున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి అవినీతి సామ్రాట్‌గా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను బెదిరించారని ఆరోపించారు.

సిద్దిపేటలో వంద ఎకరాల భూ బదలాయింపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను అందిస్తానని తెలిపారు. సీఎం నియోజకవర్గమైన కొడంగల్‌లో ఈ నెల 20న పాంచజన్య సంకల్ప సభ నిర్వహించి ప్రభుత్వ అవినీతి చిట్టాను ప్రజల ముందు పెడతామని ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ రెండూ ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయాలతో కాలయాపన చేస్తున్నాయని ఆమె విమర్శించారు.

మరిన్ని వార్తలు