21 August, 2026 | 2:10 AM

విజయ దశమికి ‘కిల్లర్’

21-08-2026 12:00 AM

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్’. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై పూర్వాజ్, పద్మనాభరెడ్డి ఏ నిర్మిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

విజయదశమి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 17న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన డేట్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికంగా సాగుతోంది. మరోవైపు ఈ సినిమాను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఓఎంజీ పిక్చర్స్ సంస్థ.. అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాల్లో విడుదల చేయబోతోంది. ఈ చిత్రానికి డీవోపీ: జగదీశ్ బొమ్మిశెట్టి; సంగీతం: ఆశీర్వాద్, సుమన్ జీవ; యాక్షన్: రాజ్‌కుమార్ గంగపుత్ర; ఎడిటర్: బీ మనోజ్ కుమార్; శివ శర్వాణి; ఆర్ట్: మణి.