కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

27-09-2026 | 02:57pm

కరీంనగర్ సిటీ సెప్టెంబర్27(విజయక్రాంతి): మాజీ మంత్రి కీర్తిశేషులు కొండ లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) జయంతిని పురస్కరించుకొని బీసీ(BC) సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.. స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని 90 సంవత్సరాలపై వయసులో కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన వ్యక్తి అని , మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో  నడిచిన మహనీయుడు లక్ష్మణ్ బాపూజీ  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనునిత్యం పాటుపడిన గొప్ప వ్యక్తి అని తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదులు కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆయనకిచ్చే గౌరవప్రదాయం. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే వారికి మనం ఇచ్చే నివాళి అని , ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆశయ సాధన కోసం కృషి చేయాలని పులుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు