కేటీఆర్ పిలుపుకు కరువైన స్పందన
07-09-2026 | 03:25pm
నాయకుల కోసం కార్యకర్తల ఎదురుచూపులు!
మూడు చింతలపల్లిలో బీఆర్‌ఎస్ ఉనికి కోలుపోతోందా....?
- శామీర్ పేట్, సెప్టెంబర్ 07(విజయ క్రాంతి): మూడు చింతలపల్లి(Moodu Chintalapalli) కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల విఫల పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం మూడు చింతలపల్లి కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అయితే కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదన్న చర్చ స్థానికంగా సాగుతోంది. ముఖ్యంగా మహిళా కౌన్సిలర్లు, వైస్ చైర్‌పర్సన్ గైర్హాజరు కావడం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. నాయకుల కోసం కార్యకర్తలే ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శలు వినిపించాయి. గతంలో హడావుడిగా కనిపించిన నాయకత్వం ప్రస్తుతం కార్యకర్తలను సమీకరించడంలో విఫలమవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మూడు చింతలపల్లిలో బీఆర్‌ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందా అనే చర్చ జరుగుతోంది.)
