15 March, 2026 | 6:03 PM

Breaking News

మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •  

అసుర గణానికి నాయకుడు!

05-11-2024 12:00 AM

‘హనుమాన్’తో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.. రోజుకో అప్‌డేట్‌తో కాక రేపుతున్నారు. సినిమాపై ఆసక్తికర చర్చకు తెరదీస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమాలో హనుమంతుడి పాత్రకు రిషబ్ శెట్టిని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు ముందు హనుమంతుడి పాత్రకు రానా దగ్గుబాటిని తీసుకుంటారంటూ టాక్ నడిచింది.

అయితే రిషబ్ శెట్టిని ప్రకటించడంతో ఈ సినిమాలో రానా నటించరని అంతా భావించారు. సడెన్‌గా రానాతో తాను, రిషబ్ శెట్టి ఉన్న ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుని ప్రశాంత్ వర్మ షాక్ ఇచ్చారు. ఈ ఫోటోకు ’జై జై హనుమాన్’ అనే క్యాప్షన్ ఇస్తూ రానా, రిషబ్ శెట్టి, ప్రశాంత్ సినిమాటిక్ యానివర్స్‌ను కోట్ చేశారు. ఈ ఫోటో బయటకు వచ్చాక అంచనాలు రెండితలయ్యాయి.

ఏదో కథను మలుపు తిప్పే పాత్రలో రానా నటిస్తున్నారని అంతా భావిస్తున్నారు. అయితే సినిమా ఎండింగ్‌లో ‘అసుర తాండవం మొదలైంది.. మరో మహా యుద్ధం పురుడు పోసుకోనుంది. ఈ విపత్తు నుంచి మానవాళిని కాపాడేందుకు నీ రాక అనివార్యం హనుమా’ అని విభీషణ పాత్రధారి అయిన సుముద్రఖని చెబుతాడు. హనుమా పాత్ర ఎవరనేది తేలింది.

కాబట్టి అసుర గణానికి నాయకత్వం వహించే పాత్రలో రానా నటించనున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ  పాత్రకు మంచి ఎత్తు, దేహం, ఆహార్యం ఉన్న వ్యక్తి అయితే సూట్ అవుతారు. కాబట్టి రానా దీనికి పర్ఫెక్ట్ అని అంతా భావిస్తున్నారు. మరి అసుర గణానికి రానా నాయకత్వం వహిస్తారో.. మర్దునా పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తారో తెలియాల్సి ఉంది.