తిరుమల మెట్లపై చిరుత

05-10-2026 | 07:47am

తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం (movement) కలకలం రేపింది. మోకాలిమిట్ట ప్రాంతంలో మెట్ల పక్కన వేకువజామున 2 గంటల సమయంలో చిరుత కనిపించడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.అదే సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం (danger) తప్పింది. చిరుత సంచారాన్ని గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు.

చిరుత కదలికలపై నిఘా (surveillance) కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలిపిరి మార్గంలో నడిచే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ప్రయాణించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు