కెమికల్ డ్రమ్ములు పేలి.. భారీ ఫైర్!
బాలాపూర్ నబిల్ కాలనీలోని ప్లాస్టిక్ గోదాంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం (fire accident) చోటుచేసుకుంది. గోదాంలో నిల్వ ఉంచిన కెమికల్ డ్రమ్ములు ఒక్కసారిగా పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటల తీవ్రత (intensity) ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అసలు మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై అధికారులు దర్యాప్తు (investigation) చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు (reason) తెలియాల్సి ఉంది.