రీఛార్జ్‌తో భారీ బెనిఫిట్
05-10-2026 | 07:43am
ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచుతున్న వేళ BSNL అదిరిపోయే ఆఫర్ (offer) తీసుకొచ్చింది. STV 202, STV 2449 ప్లాన్లను రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు అదనపు ప్రీమియం లేకుండానే రూ.1 లక్ష వ్యక్తిగత ప్రమాద బీమా (insurance) అందిస్తోంది. అంతేకాదు.. రూ.10 వేల వరకు సైబర్ మోసం కవరేజ్ (coverage) కూడా లభించనుంది. ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి BSNL ఈ ప్రయోజనాలను అందిస్తోంది.
రీఛార్జ్ చేసిన 24 గంటల్లోనే ఈ బీమా ప్రయోజనాలు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ (activate) అవుతాయని సంస్థ తెలిపింది. దీంతో రీఛార్జ్‌తో పాటు బీమా రక్షణ కూడా లభించడంతో BSNL వినియోగదారులకు ఈ ఆఫర్ ఆసక్తికరంగా మారింది.