శబరిమాత చూపిన మార్గంలో పయనిస్తే జన్మ ధన్యం: జోగు రామన్న

12-09-2026 | 07:15pm

బోథ్: శబరిమాత చూపించిన మార్గంలో పయనిస్తే మన జన్మ ధన్యమవుతుందని మాజీ మంత్రి జోగు రామన్న(Former Minister Jogu Ramanna) పేర్కొన్నారు. శనివారం మండలంలోని కనుగుట్ట గ్రామంలో నిర్వహించినఅఖండ జ్యోతి కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో వేల సంఖ్యలో శబరిమాత భక్తులు శిష్యులు ఉన్నారన్నారు. వీరంతా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారని మీరు ధన్యజీవులు అన్నారు.

శబరిమత ఆశీస్సులు పొందిన వారు తమ జీవితాలను మార్చుకొని ప్రశాంత జీవితంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు గడపడం అభినందన ఏమన్నారు. ప్రతి ఏటా అఖండ జ్యోతి కార్యక్రమం కన్నుల పండుగ కొనసాగడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో శబరిమాత ఆశ్రమాలు దినదినం అభివృద్ధి చెందుతున్నాయని అందుకు శబరిమత ఆశీస్సులు ఎంతో ఉన్నాయి అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల అనిత రాజేందర్, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, ఆశ్రమ కమిటీ అధ్యక్షులు భోజన్న, తోపాటు దేవదాస్ భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు