డా.శ్రీనివాసరావుకు జీవిత సాఫల్య పురస్కారం
- పోర్ట్‌బ్లెయిర్‌లో అంతర్జాతీయ హిందీ సదస్సులో అందజేత
- సృజనాత్మక రచనా రంగంలో ఆయన సేవలకు గుర్తుగా పురస్కారం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20 : సృజనాత్మక రచనా రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖ రచయిత డా. కె. శ్రీనివాసరావు(K. Srinivasa Rao)కు ‘సృజనగాథ జీవిత సాఫ్యల్య పురస్కారం’ (లైఫ్‌టైం అచీవ్‌మెంట్) లభించింది. పోర్ట్‌బ్లెయిర్(Port Blair)లో జరుగుతున్న 26వ అంతర్జాతీయ హిందీ సదస్సు(International Hindi Conference)లో ఆయనను ఈ పురస్కారంతో స త్కరించారు. హిందీ భాష(Hindi language), సాహిత్యానికి అం తర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు, సాహిత్యం, సృజనాత్మక రచ నా రంగాల్లో విశేష కృషి చేస్తున్న సాహితీవేత్తలను గౌరవించడం అంతర్జాతీయ హిందీ సదస్సు ప్రధాన ఉద్దేశం.
సృజనాత్మక రచనా రంగానికి, భారతీయ సాహిత్య పరిపుష్టికి డా. కె. శ్రీనివాసరావు సుదీర్ఘకాలంగా సేవ లు అందజేస్తున్నారు. ఆయన రచయితగానే కాకుండా, సాహిత్య నిర్వాహుడిగా, పండితుడిగా బహుముఖ పాత్రలు పోషించారు. ఆ యన సేవలకు గుర్తింపుగా జీవిత సాఫ్యల పు రస్కారం దక్కింది. శ్రీనివాసరావు సాహిత్య, సృజనాత్మక సేవలను నిర్వాహకులు ప్రశంసించారు.
భవిష్యత్తులోనూ ఆయన సాహి త్య ప్రస్థానం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. సదస్సు సమన్వయకర్త డా.జయప్రకాశ్ మానస్, ప్రముఖ భాషావేత్త, స్వాగతాధ్యక్షుడు డా. అజయ్ పాఠక్, అధ్యక్షురాలు డా.సవిత్తా మోహన్‌తో పాటు సాహితీవేత్తలు, హిందీ భాషా ప్రముఖులు సదస్సులో పాల్గొన్నారు.