ఆలయంపై పడిన పిడుగు
20-09-2026 | 07:38pm
పేలిన రెండు సెల్ ఫోన్లు, గాయపడిన ఇద్దరు రైతులు
ధ్వంసమైన ఆలయ గోపురం
కామారెడ్డి జిల్లా దుర్గం రోడ్డులో ఘటన
కామారెడ్డి, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District)లో ఆదివారం ఓ ఆలయం గోపురంపై పిడుగు పడి ధ్వంసం అయింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని దుర్గం రోడ్డులో నిర్మించిన సేవాలాల్ మహారాజ్ ఆలయం(Sevalal Maharaj Temple)పై ఉరుములు మెరుపులు వచ్చి పిడుగు పడి ధ్వంసం అయింది. దీంతో ఆలయం పాక్షికంగా ధ్వంసం అయింది. బొప్పాజీ వాడి శివారులో పత్తి చేనులో పనిచేస్తున్న ఇద్దరు రైతులు శంకర్రావు, సూర్యకాంత్ ల వద్ద గల రెండు సెల్ ఫోన్లు పేలిపోయాయి. దీంతో రైతులకు గాయాలయ్యాయి. వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. చేనులో ఉండగా ఒకేసారి వర్షం వచ్చి ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు పడినట్లు రైతులు తెలిపారు.