మద్దూరు బస్టాండ్‌కు మహర్దశ.. ఇక పైలట్ బస్ స్టేషన్!
18-09-2026 | 10:01am
మద్దూర్ మండల్, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): నారాయణపేట జిల్లా(Narayanpet District) మద్దూరు పట్టణానికి మరో ఆధునిక సదుపాయం అందుబాటులోకి రానుంది. మద్దూరు బస్టాండ్‌ను(Maddur bus stand) పైలట్ బస్ స్టేషన్‌గా అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది. బస్టాండ్‌ను ఆధునిక వసతులతో తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. పైలట్ బస్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తే ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మద్దూరు పట్టణ అభివృద్ధిలో ఇది మరో ముందడుగుగా స్థానికులు భావిస్తున్నారు. బస్టాండ్ అభివృద్ధి పనులు పూర్తయితే ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా సేవలు అందనున్నాయి.