5 రోజుల జైలు శిక్ష
18-09-2026 | 11:50am
సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి): సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్(Siddipet Two Town Police Station) పరిధిలోని వేములవాడ కమాన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive) తనిఖీలో గరిపల్లి బాలయ్య అనే వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారని సీఐ మురళి తెలిపారు. గురువారం అతడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి విచారణ జరిపి అయిదు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిరోజూ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్టు సీఐ మురళి తెలిపారు.