ధర్మ రావు పేటలో ఘనంగా మహా అన్న ప్రసాద వితరణ

20-09-2026 | 09:53pm

గణపురం, సెప్టెంబర్ 20 (విజయ క్రాంతి): మండలంలోని ధర్మారావుపేట భూలక్ష్మి ఆవరణలో దాతల సహకారంతో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు కేశెట్టి ప్రకాష్, కార్యదర్శి ఆకుల కృష్ణస్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని సర్పంచ్ పూజారి రాజేందర్, ఉపసర్పంచ్ గండు శ్రీనివాస్, సోషల్ జస్టిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆరెందల లలిత శంకరయ్య, బాపని రాజయ్య, బేతి సుజాత రవీందర్‌తో పాటు గ్రామ పెద్దలు ఆకుల రవీందర్, ఆకుల సదానందం, గండు శ్రీధర్, దూలం శంకర్, పాలకుర్తి తిరుపతి, రాచకొండ కుమారస్వామి, వేముల అశోక్, ఆకుల రమేష్, బాపని రవీందర్, కట్కామ్ కిరణ్, ఎల్లంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు