పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
అమన్‌గల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహేశ్వరం ఏసీపీ జానకి రెడ్డి
అమన్‌గల్, జూలై 24(విజయక్రాంతి): మహేశ్వరం ఏసీపీ ఎస్. జానకి రెడ్డి అమన్‌గల్ పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం సందర్శించి, స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి మరియు విజిబుల్ పోలీసింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా విజిటింగ్ నోట్‌లో సిబ్బందికి పలు కీలక సూచనలు జారీ చేశారు.పెండింగ్ మరియు గ్రేవ్ కేసుల దర్యాప్తును వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలి. సీసీటీన్స్ , ఈ సాక్షి వ్యవస్థలను దర్యాప్తులో సమర్థవంతంగా ఉపయోగించాలని సూచించారు.
సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచాలి. క్షేత్రస్థాయిలో భద్రతను పెంపొందిస్తూ, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ, స్టేషన్ పరిసరాలను హరితవనంలా పరిశుభ్రంగా ఉంచాలన్నారు.ఈ సూచనలను పాటిస్తూ ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించాలని ఏసీపీ అధికారులకు స్పష్టం చేశారు.






