యుద్ధానికి భయపడని మైసా మెస్రం!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(National Crush Rashmika Mandanna) తన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మక పాన్-ఇండియా యాక్షన్ డ్రామా(Pan-India action drama) ‘మైసా(Maisa)’లో నటిస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ ‘మైసా’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఆకట్టుకునే ఫస్ట్ గ్లింప్స్(First Glimpse)తో ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘మైసా’.. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తాజాగా మేకర్స్ టీజర్‌ను లాంచ్ చేశారు. ‘అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను’ అంటూ రష్మిక చెప్పే డైలాగ్‌తో ఆమె పాత్రలోని ఇంటెన్సిటీని పరిచయం చేశారు.
తన జీవితంలో ఎదుర్కొనే అనేక సవాళ్లు, సామాజిక అడ్డంకులను అధిగమిస్తూ.. ప్రతి సమస్యను ఎదురించి పోరాడే ఒంటరి యోధురాలిగా ‘మైసా’ కనిపిస్తుంది. ‘యుద్ధానికి ఆయుధమంటే భయం.. కానీ, ఆయుధం ఏ యుద్ధానికీ భయపడదు’, ‘మైసా మెస్రం.. షీ ఈజ్ ద వెపన్’ వంటి పవర్‌ఫుల్ డైలాగులు ఆకట్టుకుం టున్నాయి. గోండ్ గిరిజన మహిళ పాత్రలో రష్మిక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టారు. బైక్‌ను ఎంతో ధైర్యంగా నడపడంతో పాటు అండర్‌వాటర్ సీక్వెన్స్‌లలోనూ సాహసోపేతమైన స్టంట్స్ చేశారు. పాత్ర కోసం రష్మిక తనను తాను పూర్తిగా మార్చుకున్న తీరు టీజర్.. చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతోంది.