23 June, 2026 | 11:49 AM

బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ

23-06-2026 11:04 AM

బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో చోరీ జరిగింది. సరస్వతి అమ్మవారి ఆలయపై అంతస్తులోని మహంకాళి జరిగినట్లు అధికారులు తెలిపారు. మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, హుండీ అపహరించారు. దుండగులు ఆలయ గేటు ధ్వంసం చేసి వెండి కిరీటం, హుండీ ఎత్తుకెళ్లారు. ఆలయంలో పూజారులు అభిషేకం కోసం వెళ్లి చూడగా చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యాస గుడి వద్ద దుండగులు హుండీ పడేశారు. ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయానికి చేరుకున్న ఎస్పీ జానకి షర్మిల వివరాలు ఆరా తీశారు. ముథోల్ ఎమ్మెల్యే రామారావు, భైంసా సబ్ కలెక్టర్ ఆలయాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.