26 August, 2026 | 2:15 PM

మంత్రి వాకిటి శ్రీహరికి అస్వస్థత

26-08-2026 01:40 PM

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు

తన నివాసంలో మంత్రికి ప్రథమ చికిత్స

నారాయణపేట: తెలంగాణ పశుసంవర్థక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) అస్వస్థతకు గురయ్యారు. మక్తల్(Makthal) లోని తన నివాసంలో వైద్యుల ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్య కోసం మంత్రి వాకిటి హైదరాబాద్ కు బయలుదేరారు. వాకిటి శ్రీహరి ఆరోగ్యంపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉన్నాయి.

బుధవారం ఉదయం మక్తల్ నియోజకవర్గం(Makthal Constituency) మాగనూర్ మండల కాంగ్రెస్ గ్రామస్థాయి ముఖ్య నేతలు, సర్పంచులు, కార్యకర్తల సమావేశం మంత్రి వాకిటి శ్రీహరి  పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ సంస్థాగత బలోపేతం, ఇప్పటి వరకు పూర్తి అయిన పనులు, పెండింగ్ లో ఉన్న పనులు, గ్రామాల్లో ఇంకా చేయాల్సిన పనులపై గ్రామాలవారీగా నేతలను నుంచి మంత్రి వాకిటి శ్రీహరి వివరాలు అడిగి తెలుసుకున్నారు.