ఏఐకెఎమ్ఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
రైతు సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
ఏఐకెఎమ్ఎస్ డివిజన్ కార్యదర్శి మేకల కనకారావు
గరిడేపల్లి, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలీ సంఘం(All India Agricultural Workers Union) జాతీయ మహాసభల గోడపత్రికలను నాయకులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐకెఎమ్ఎస్ డివిజన్ కార్యదర్శి మేకల కనకారావు(AIKMS Division Secretary Mekala Kanakarao) మాట్లాడుతూ ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలో నిర్వహించనున్న జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని, యూరియా కొరతను నివారించి, రైతులకు సకాలంలో అందించాలని కోరారు.
రైతులకు అందుతున్న సబ్సిడీలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమాను పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐకెఎమ్ఎస్ గ్రామ కార్యదర్శి చెనగాని పెద్ద సాంబయ్యతో పాటు తాళ్లూరి చిన్న సూర్యం, చెనగాని లక్ష్మయ్య, పర్వతాలు, గండు రాంబాబు, గండు మల్లయ్య, కామల్ల శ్రీను, ముత్తయ్య, రేణుక, నరసయ్య, రుతమ్మ, లక్ష్మీ, సువార్త, కళ్యాణి, మల్లమ్మ, మాజీ సర్పంచ్ మా శెట్టి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.