6 September, 2026 | 12:08 PM

ప్రభుత్వాస్పత్రి ల్యాబ్ లో యువకుడి ఆత్మహత్య

06-09-2026 | 10:35am

సిద్దిపేట క్రైం, సెప్టెంబర్ 6(విజయక్రాంతి) : సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో(Siddipet Government Hospital) ఆదివారం రాత్రి విషాద ఘటన జరిగింది. ఆసుపత్రి మూడో అంతస్తులోని ల్యాబ్‌లో పనిచేస్తున్న ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు రాజ్‌గోపాల్‌పేట గ్రామానికి చెందిన ఆకుబత్తిని పవన్ గా గుర్తించారు. పవన్  కొంతకాలంగా సిద్దిపేటలోని కోటిలింగాల ఆలయం(Kotilingala Temple) సమీపంలో నివాసం ఉంటూ, ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మరిన్ని వార్తలు