విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
21-08-2026 12:27 PM
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), ఆగస్టు21: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లా తిమ్మాపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ రహిమాన్ (54)తన వ్యవసాయ పొలం సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద నుండి వస్తుండగా ఎర్త్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






