వరలక్ష్మి దేవి రావమ్మా అంటూ మహిళల పూజలు
21-08-2026 01:56 PM
కోహెడ, ఆగస్టు 21, విజయక్రాంతి: శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని.. మహిళలు కన్నుల పండువగా వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. పలువురు భక్తులు ఇంట్లో పూలు, పండ్లు, ప్రసాదాలు శ్రీ మహాలక్ష్మి ప్రతిమపటం ఎదుట అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కుటుంబలలో సిరి సంపదలు కలగాలని వేడుకున్నారు.






