మణిరత్నం ఇంజి వెల్లం
విజయ్ సేతుపతి(Vijay Sethupathi), సాయిపల్లవి(Sai Pallavi) ప్రధాన పాత్రల్లో స్టార్ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam) కొత్త సినిమా పేరు ఖరారైంది. ఈ చిత్రానికి ‘ఇంజివెల్లం(Inji Vellam Movie)’ అనే టైటిల్‌ను ప్రకటించారు. దీనికి తెలుగులో ‘అల్లం నీరు’ అర్థం. తాజాగా విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్(Title announcement poster)లో నాయకానాయికలు విజయ్ సేతుపతి, సాయిపల్లవిల లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌ను చూస్తే.. ఈ చిత్రాన్ని ఒక రొమాంటిక్ డ్రామా(Romantic drama)గా తీర్చిదిద్దుతున్నారని, ఇది కోల్‌కతా నేపథ్యంగా సాగే కథ అని అర్థమవుతోంది.
ఈ చిత్రాన్ని 2027 జనవరిలో విడుదల చేయనున్నట్టు కూడా ఈ సందర్భంగా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఇండియా టాకీస్ బ్యానర్లతో కలిసి మద్రాస్ టాకీస్ నిర్మిస్తోంది. కథాబలమున్న చిత్రాల్లో నటించి మెప్పించే విజయ్ సేతుపతి, సాయిపల్లవిలు మణిరత్నం దర్శకత్వంలో నటిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘థగ్ లైఫ్’ డిజాస్టర్ తర్వాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.