లింగారెడ్డిపేట్ చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం

20-09-2026 | 07:41pm

మనోహరాబాద్, సెప్టెంబర్ 20, (విజయ క్రాంతి): మనోహరాబాద్ పోలీస్ స్టేషన్(Manoharabad Police Station) పరిధిలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన అబ్బాదాసు స్వామి, 39, ఈనెల 18న సుమారు నాలుగున్నర గంటలకు ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో తన తమ్ముడు అబ్బాదాసు నవీన్ కుమార్ శనివారం రాత్రి ఫిర్యాదు చేయగా, మనోహరాబాద్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసి గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా లింగారెడ్డిపేట చెరువులో స్వామి మృతదేహం లభించింది.

ప్రాథమిక విచారణలో చెరువులో నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం మరియు చట్టపరమైన చర్యల నిమిత్తం తూప్రాన్ సిహెచ్ఎస్సి కి తరలించారు. మృతుడికి గతంలో ప్రమాదం జరిగినట్లు, మద్యం సేవించే అలవాటు ఉన్నట్లు, అలాగే గతకొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య కుటుంబపరమైన విభేదాలు ఉన్నట్లు తెలిసిందని పేర్కొంటూ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను నిర్ధారించేందుకు కేసు దర్యాప్తు కొనసాగుతోందని మనోహరబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు.

మరిన్ని వార్తలు