చిన్న వార్వాల్‌లో మహా రక్తదాన శిబిరం

20-09-2026 | 07:04pm

మహబూబ్ నగర్ జిల్లా గండీడ్, సెప్టెంబర్ 20 విజయక్రాంతి: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాల్లో భాగంగా చిన్న వార్వాల్ గ్రామంలో మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు కె. విజయకుమార్ నాయకత్వంలో, కన్వీనర్ నరహరి రెడ్డి, కోకన్వీనర్లు బద్రిశ్వర్, రాజేశ్వరి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. శిబిరానికి యువత, గ్రామ ప్రజలు విశేషంగా స్పందించారు. బీజేపీ వనపర్తి జిల్లా ఇన్‌చార్జి గిర్మోని శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్ నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చని అన్నారు. యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు