ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన మేడ్చల్ కలెక్టర్
కూకట్ పల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గం పరిదిలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను కూకట్ పల్లి జోనల్ కమీషనర్ మయాంక్ సింగ్ తో కలిసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి పర్యవేక్షించారు. కేపిహెచ్బి కాలనీ లో బిఎల్ఓలు ఇంటిఇంటికి తిరిగి అందిస్తున్న ఏన్యుమరేషన్ పత్రాల కార్యక్రమకన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ప్రతీ రోజు ఉదయం బి ఎల్ ఓ ల అటెండెన్స్ తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఒక్కొక్కరికి ఎన్ని ఎన్రోల్మెంట్ పత్రాలు ఇస్తున్నారని, ఎన్రోల్మెంట్ ప్రక్రియ ను యాప్ లో ఎలా ఎంటర్ చేస్తున్నారని బి ఎల్ ఓ లను అడిగి తెలుసుకున్నారు. ఒక్కరికి రెండు పత్రాలు అందజేస్తున్నామని, క్యూఆర్ కోడ్ ద్వారా యాప్ లో అప్ లోడ్ చేస్తున్నామని బి ఎల్ ఓ లు కలెక్టర్ కు వివరించారు. పత్రాలు ఇచ్చిన తరువాత తప్పనిసరిగా యాప్ లో అప్ లోడ్ చేయాలనీ కలెక్టర్ సూచించారు. మ్యాపింగ్ కానీ వారి వివరాలను బిఎల్ఏ లతో సమన్వయం చేసుకుంటూ ఎన్యుమరేషన్ ఫామ్స్ అందించాలని బి ఎల్ ఓ లకు సూచించారు.ఈ కార్యక్రమం లో కూకట్ పల్లి తహసీల్దార్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.






