మనోహరాబాద్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మేడ్చల్ రామస్వామి ఎన్నిక
మనోహరబాద్,(విజయక్రాంతి): మనోహరాబాద్ మండల ఎస్సీ సెల్ చైర్మన్(Manoharabad Mandal SC Cell Chairman) గా మేడ్చల్ రామస్వామి అధికారికంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యనారాయణ(MLA Satyanarayana) ఆదేశాల మేరకు అధికారికంగా ప్రకటించారు. వీరితోపాటు తూప్రాన్ టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షునిగా సర్గల వినీత్ కుమార్ ఎన్నికయ్యారు. మనోహరాబాద్ మండల కేంద్రంలోని మనోహ రెస్టారెంట్ వద్ద వీరి ఇరువురికి అధికారికంగా నియామాక పత్రాన్ని రాష్ట్ర నాయకులు చిటుకుల మహిపాల్ రెడ్డి, రాష్ట్ర వైస్ చైర్మన్ కొమ్ము విజయ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ తాడేపు మహేందర్ ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ... మాకు ఇచ్చిన ఈ పదవిని సొంత లాభాపేక్ష కోసం కాకుండా పార్టీకి అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో మనోహరాబాద్ మండల అధ్యక్షులు మల్లారెడ్డి, తూప్రాన్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షులు గరిగే నరసింగారావు, అధికార ప్రతినిధి సత్యనారాయణ, నాయకులు చిట్టి మిల్ల అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల నరసింహ, టేక్మాల్ వెంకట్ రెడ్డి, నాగరాజు గౌడ్, మైనార్టీ అధ్యక్షులు జావేద్ పాషా, వెన్నెల్లి కృష్ణ, బక్క శ్రీనివాస్, వి. వెంకట్ రెడ్డి, ఎస్. కిట్టు, రేకల నయాందాస్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.