ఎస్టీ బాలుర వసతిగృహ నిర్మాణానికి శంకుస్థాపన
కొల్లాపూర్‌లో రూ.2.50 కోట్లతో ఎస్టీ బాలుర వసతిగృహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన: మంత్రి జూపల్లి కృష్ణారావు.
కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్(Kollapur) పట్టణంలో రూ.2.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఎస్టీ బాలుర వసతిగృహం(ST Boys Hostel) నూతన భవనానికి శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గిరిజన విద్యార్థులు విద్యలో ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని వసతులను కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. విద్యార్థుల చదువుకు అనుకూలమైన వాతావరణం, సురక్షితమైన వసతి, నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటే వారు మరింత మెరుగ్గా విద్యనభ్యసించగలరని అన్నారు.
గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని.. గిరిజన విద్యార్థులకు(Tribal students) విద్యా అవకాశాలను మెరుగుపరిచి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. హాస్టళ్లలో భవనాలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యం. వైస్ ఛైర్మెన్ షేక్ రహీం భాష. మున్సిపల్ కౌన్సిలర్లు. అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు. వంగ రాజశేఖర్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు.