15 March, 2026 | 1:01 PM

పేద విద్యార్థినికి అండగా మంత్రి పొన్నం

08-11-2024 11:34 AM

హైదరాబాద్: రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేద విద్యార్థినికి అండగా నిలిచారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ కి చెందిన ప్రవళిక సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజిలో సీటు సాధించి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇదే విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం  ప్రభాకర్   ప్రవళిక హాస్టల్ ఖర్చుల కోసం రూ 1. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు మంత్రి పొన్నం కు ధన్యవాదాలు తెలిపారు.