ముత్తారం మాజీ జడ్పీటీసీ జగన్మోహన్ రావును పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

20-09-2026 | 09:50pm

ముత్తారం, సెప్టెంబర్ 20 (విజయ క్రాంతి): గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్తారం మండలం మాజీ జడ్పీటీసీ జగన్మోహన్ రావును (Former ZPTC Jaganmohan Rao)రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం పరామర్శించారు. కరీంనగర్‌లోని జగన్మోహన్ రావు నివాసానికి వెళ్లిన మంత్రి, ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలపై కుటుంబ సభ్యులతో మాట్లాడి, జగన్మోహన్ రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎల్లవేళలా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

మంత్రి వెంట మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, మంతిని మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న, సర్పంచ్ వనం రామచంద్రరావు,  నాయకులు ఎల్లా రామ్మూర్తి ఆరేళ్లి కొమురయ్య గౌడ్, బుజ్జి, నా యకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు