జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
06-10-2026 | 03:23pm
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య (MLA Koram Kanakaiah)మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించి, పనుల పురోగతిని సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి చదువు, విద్యా సౌకర్యాలు, కళాశాలలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.