రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడిని సన్మానించిన పద్మశాలిలు

06-10-2026 | 04:55pm

బోథ్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): పట్టణానికి చెందిన పద్మశాలి సంఘం(Padmashali Sangham) ఆధ్వర్యంలో ఇటీవల రెడ్ క్రాస్ సొసైటీ ఎంసి మెంబర్గా గెలుపొందిన మాసం అనిల్ కుమార్ ను సన్మానించారు. బూత్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మెరుగు భోజన్న ఆధ్వర్యంలో సన్మానించిన అనంతరం మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు సిరిపురం చందు, కొండ స్వామి, కటకం నగేష్, దాస్, అడే పూకిరణ్, మెరుగురమేష్, కటకం ప్రసాద్ ఆడేపు ప్రసాద్ ,కట్కూరి గంగాధర్ సిరిపురం, శేఖర్, బిట్లింగ్ సురేష్ ,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు