పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంఎల్ఏ జారే ఆదినారాయణ
26-06-2026 09:19 PM
దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట మండలంలో అశ్వరావుపేట నియోజకవర్గ ఎం ఎల్ ఏ జరే ఆదినారాయణ శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా మండల పరిధిలోని ఎర్రగుంపు గ్రామంలో గల సబ్ స్టేషన్ లో సిసి రోడ్డు శంకుస్థాపన, ఇదే గ్రామంలో స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన, అంకంపాలెం గ్రామ పంచాయతీలో స్కూల్ ప్రహరీ గోడ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయుకులు, సర్పంచలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గోన్నారు.






