22 August, 2026 | 5:21 PM

రాష్ట్రస్థాయి పోటీలకు నిర్మల్ విద్యార్థులు

22-08-2026 04:13 PM

నిర్మల్, ఆగస్టు 22 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలలో విజేతలుగా నిలిచినట్లు ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. కంప్యూటర్ అప్లికేషన్ విభాగంలో రాష్ట్ర స్థాయి జీజ్ఞాస పోటీలు హైదరాబాద్ లో పోటీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  కంప్యూటర్ అప్లికేషన్ విభాగం అధ్యాపకుడు త్రిపాఠీ వెంకట్ రెడ్డి., విద్యార్థుల ఆఫషీన్ పాతిమ, నిమ్మ రుత్వి, గబ్బర్ సింగ్, గడపాలె పూజ, కే విష్ణు పాల్గొని ప్రతిభ సాధించినట్లు ఆయన తెలిపారు. ప్రతిభ సాధించిన విద్యార్థులకు కళాశాల కంప్యూటర్  విభాగం అధిపతి దిలీఫ్ కుమార్, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.