తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కుంభం
ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరవీరులను స్మరించుకున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని విశ్వకర్మకు నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎఫ్ఏసీ భాస్కరరావు, ఎస్పీ అక్షాంత్ యాదవ్, అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.