9 June, 2026 | 1:19 AM

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులపై ఎమ్మెల్యే శంకర్ సమీక్ష

09-06-2026 12:24 AM

షాద్‌నగర్, జూన్ 8 (విజయక్రాంతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ప్రాజెక్టు పరిధిలోని ప్యాకేజీలు, భూసేకరణ, పరిపాలనా అనుమతుల పురోగతిపై ఆయ న సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిజర్వాయర్ బండ్, పంప్ హౌస్, కాలువలు, టన్నెల్ నిర్మాణాల కోసం మొత్తం 2,919 ఎకరాల భూమి అవసరమని, దీని కోసం సుమారు రూ. 350.84 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.

ఈ భూసేకరణకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరితగతిన పూర్తి చేసి, అవసరమైన ఆర్థిక, పరిపాలనా అనుమతులు పొందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూ ర్తయితే షాద్నగర్, పరిగి నియోజకవర్గాల పరిధిలో సాగు మరియు తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడమే కాకుండా, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి, వ్యవసాయ పురోగతికి ఎంతగానో దోహదప డుతుందని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు.