ఆదివారం నుండి ప్రజలకు అందుబాటులోకి మార్కెట్

16-09-2026 | 06:31pm

మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

రామచంద్రపురం: రామచంద్రపురం మండలం భారతీనగర్ డివిజన్ పరిధిలోని బాంబే కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మోడల్ రైతు బజార్ షాపుల(Model rythu bazaar shops) ప్రారంభ కార్యక్రమానికి పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) ఇన్‌చార్జ్  ఆదర్శ్ రెడ్డి, భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్  వి.సింధు ఆదర్శ్ రెడ్డి(Former Corporator Sindhu Adarsh ​​Reddy), అమీన్‌పూర్ డిప్యూటీ కమిషనర్  ప్రదీప్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతు బజార్ షాపుల కేటాయింపుదారులతో మాట్లాడి, ప్రస్తుతం కొన్ని మౌలిక సదుపాయాల పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆదివారం నుంచి కూరగాయలు, పండ్లు, నాన్‌వెజ్ తదితర అన్ని రకాల సరుకుల విక్రయాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలి.

షాపు కేటాయింపుదారులను ఆదర్శ్ రెడ్డి కోరారు. అలాగే రైతు బజార్‌లో మిగిలి ఉన్న షాపులకు టెండర్ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి, అన్ని షాపులను వినియోగంలోకి తీసుకురావాలని సింధు ఆదర్శ్ రెడ్డి  అధికారులను కోరారు.రైతు బజార్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే భారతీనగర్, బాంబే కాలనీతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

ప్రజలకు తాజా కూరగాయలు, పండ్లు, నాన్‌వెజ్ తదితర సరుకులు ఒకే చోట అందుబాటు ధరల్లో లభించడంతో పాటు, నిత్యావసర సరుకుల కొనుగోలు మరింత సులభతరం అవుతుంది. ప్రజల సౌకర్యం, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేసి రైతు బజార్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదర్శ్ రెడ్డి , సింధు ఆదర్శ్ రెడ్డి  కోరారు.

మరిన్ని వార్తలు