దశదిన కర్మల కోసం మున్నూరు కాపు సంఘం ఆర్థిక సాయం
అశ్వాపురం, (విజయక్రాంతి): అశ్వాపురం మండల పరిధిలోని మొండికుంట గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ సంగు కిరణ్ బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆకస్మికంగా మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని గమనించిన అశ్వాపురం మండల మున్నూరుకాపు సంఘం మానవత్వంతో ముందుకు వచ్చి బుధవారం దశదిన ఖర్మల ఖర్చుల నిమిత్తం రూ.11,500లను కుటుంబ సభ్యులకు అందజేసింది.
ఈ సందర్భంగా సంఘం నాయకులు కుటుంబానికి ధైర్యం చెబుతూ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం మండల అధ్యక్షుడు కమటం వెంకటేశ్వరరావు, యువజన సంఘం మండల అధ్యక్షుడు పర్వత నరేష్, సభ్యులు మామిడి శ్రీను, బచ్చు వెంకటరమణ, తోట వేణు, దండి రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సహాయం పట్ల కిరణ్ కుటుంబ సభ్యులు కన్నీటి కళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.




