29 July, 2026 | 9:57 PM

Breaking News

బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •  

ఫార్మాసిటీకి 17 ఎకరాలు ఇచ్చా.. రియల్ ఎస్టేట్ కోసం వాడుకుంటే ఊరుకుంటామా?

11-06-2026 04:49 PM

ఫ్యూచర్ సిటీని వందకు వంద శాతం బీఆర్ఎస్ రద్దు చేస్తోంది: హరీశ్ రావు

హైదరాబాద్: ఫ్యూచర్ సిటీని(Future City project) వందకు వంద శాతం బీఆర్ఎస్ రద్దు చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల రూ. 70 వేల కోట్ల ఫార్మా పెట్టుబడులు పోయాయని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ పెట్టుబడులు నెల్లూరు శ్రీసిటీకి వెళ్లాలని తెలిపారు. భూములు ఫార్మాకు కాకుండా మార్పులు చేస్తే చట్టం అంగీకరించదన్నారు. ఫార్మాసిటీ కోసం తాను కూడా 17 ఎకరాల భూమి ఇచ్చానని వివరించారు.

ఫార్మా భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడితే ఊరుకుంటామా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఫార్మాసిటీ భూములపై ఇప్పటికే పలువురు రైతులు కేసులు వేశారని తెలిపారు. జర్నలిస్టులపై ప్రేమ ఉంటే వివాదాలు లేని భూములు ఇవ్వొచ్చు కదా అన్నారు. అంత దూరంలో ఎందుకు?.. రోజూ అమ్ముతున్న భూములు ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చానా తాము వ్యతిరేకించం అన్నారు. పాత భూములనే జర్నలిస్టులకు ఎందుకు ఇవ్వరు? అని హరీశ్ రావు పేర్కొన్నారు.