వాటర్ ట్యాంకర్ బహూకరించిన మైహోమ్ యాజమాన్యం

03-10-2026 | 05:36pm

మఠంపల్లి,(విజయక్రాంతి): మైహోమ్ సిమెంట్ యాజమాన్యం(My Home Cement management) వారు మండలంలోని గుండ్లపల్లి గ్రామపంచాయతీ(Gundlapalli Gram Panchayat)కి వాటర్ ట్యాంకర్ ను శుక్రవారం బహూకరించారు. మేళ్లచెరువులో ఉన్న మై హోమ్ సిమెంట్ పరిశ్రమ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ ట్యాంకర్ ను అందించింది.ఫ్యాక్టరీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కంపెనీ అధికారులు కొబ్బరికాయ కొట్టి ట్యాంకర్ ను గుండ్లపల్లి సర్పంచ్ గుండా వెంకట రమణ బ్రహ్మారెడ్డి కి అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వెంకట రమణ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య(sanitation) పనులు వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఈ వాటర్ ట్యాంకర్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.గ్రామ పంచాయతీ అవసరాన్ని గుర్తించి ట్యాంకర్ అందించిన మై హోమ్ యాజమాన్యానికి గ్రామపంచాయతీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో మై హోమ్ యాజమాన్యం శ్రీనివాసరావు శ్రీరామ్, సుబ్రహ్మణ్యం, రత్నం, ఉపసర్పంచ్ కొండల్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు