ఆ ప్రేమకథ మళ్లీ బిగ్‌స్క్రీన్‌పై!

01-10-2026 | 04:58pm

టాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్ ప్రేమకథా చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న ‘గీతాంజలి’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జున హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్లాసిక్ మూవీని నవంబర్ 13న రీ-రిలీజ్( Re-release ) చేయనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) అధికారికంగా ప్రకటించింది. మరణానికి దగ్గరవుతున్న ఇద్దరు ప్రేమికుల మధ్య సాగే భావోద్వేగభరితమైన కథతో తెరకెక్కిన ‘గీతాంజలి’ అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా నాగార్జున కెరీర్‌లో బ్లాక్‌బస్టర్(Blockbuster)గా నిలిచింది.

ముఖ్యంగా సినిమాలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ప్రేమకథను మరోసారి బిగ్‌స్క్రీన్(Big Screen)పై చూసే అవకాశం రావడంతో నాగార్జున అభిమానులతో పాటు సినీ ప్రియుల్లోనూ ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు