నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ
పాల్వంచ,(విజయక్రాంతి): నవ లిమిటెడ్(Nav Limited), పాల్వంచ సామాజిక కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రం(Nav Women's Empowerment Centre)లో తాటి ఆకుల కళాకృతులు విక్రయించడం ద్వారా రూ.2,58,470/-వచ్చిన నగదు, యూనిఫామ్స్ కుట్టడం ద్వారా రూ. 1,01,655/-వచ్చిన నగదు, మొత్తం రూ.3,60,125/ ప్రమోటర్ దేవినేని రమా చెక్కులను శనివారం చేతి వృత్తుల కళాకారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం,సమాజం అభివృద్ధి చెందుతుంది. మహిళలు అన్ని రంగాల్లో ముందుడాలని ఆ కుటుంబం ఎప్పుడూ ఆనందమయంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అముద, స్వరూపరాణి, అరుణ, బీ.అరుణ, శిరీష, దివ్య,కవిత, విద్యార్థులు పాల్గొన్నారు.