జపాన్‌కు భారీ టెన్షన్!

26-09-2026 | 07:46am

జపాన్‌కు ఇది డూ ఆర్ డై మ్యాచ్.. నేపాల్‌కు మాత్రం మరో గెలుపుపై కన్ను! 

జపాన్ డూ ఆర్ డై! నేపాల్‌తో హై-వోల్టేజ్ ఫైట్! 

2026 ఆసియా క్రీడల క్రికెట్‌లో(Asian Games Cricket 2026) గ్రూప్ దశ చివరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆతిథ్య జట్టు జపాన్.. ఓటమి ఎరుగని నేపాల్‌తో(Japan vs Nepal) తలపడనుంది. ఆఫ్ఘనిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన నేపాల్ జట్టు మంచి జోష్‌లో ఉండగా.. జపాన్‌కు మాత్రం ఈ మ్యాచ్‌లో గెలుపు అత్యంత కీలకంగా మారింది. క్వార్టర్ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే జపాన్ ఈ మ్యాచ్‌ను గెలవాల్సిందే. అంతేకాదు.. గ్రూప్-Aలో టాప్-2లో చోటు దక్కించుకోవాలంటే భారీ తేడాతో విజయం సాధించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో మ్యాచ్‌పై ఉత్కంఠ పెరిగింది.

ఇప్పటివరకు అంతర్జాతీయ వేదికపై ఇరు జట్లు ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో నేపాల్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పుడు అదే నేపాల్(Nepal) మరోసారి జపాన్‌కు ఎదురుగా నిలవడంతో.. ఆతిథ్య జట్టు ప్రతీకారం తీర్చుకుంటుందా? లేక నేపాల్ తన జోరును కొనసాగిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. నిషిన్‌లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ప్రతి పరుగూ, ప్రతి వికెట్టూ కీలకం కానుంది. జపాన్‌కు క్వార్టర్ ఫైనల్ ఆశలు.. నేపాల్‌కు గ్రూప్ దశలో ఆధిపత్యం కొనసాగించాలనే లక్ష్యం. దీంతో ఈ పోరు ఆసియా క్రీడల్లో(Asian Games ) మరో హై-వోల్టేజ్ మ్యాచ్‌గా మారనుంది.

మరిన్ని వార్తలు