భువనగిరిలో నూతన బాల సదనం ప్రారంభం
ఆలేరు,అక్టోబర్ 6 (విజయక్రాంతి): భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం వద్ద నూతనంగా నిర్మించిన బాల సదనం భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Bhongir MLA Kumbam Anil Kumar Reddy) ముఖ్య అతిథిగా హాజరై, పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాల సదనంలోని బాలికలతో ఎమ్మెల్యే మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
బాలల సంక్షేమం, భద్రత, విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. బాల సదనం ద్వారా పిల్లలకు మెరుగైన వసతి, విద్య, సంరక్షణ అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి–రవికుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తి, జిల్లా సంక్షేమ అధికారి చ. శ్రీనివాస్, డీఈ శివకుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీరేఖ–బాబురావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కూర వెంకటేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.