క్రిస్టియన్‌పల్లిలో నూతన బోర్ మోటార్ ప్రారంభం
తాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యం: డిప్యూటీ మేయర్ ఎంఎస్ఆర్
మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్(Mahabubnagar Municipal Corporation) పరిధిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా నిరంతర నీటి సరఫరా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్‌రెడ్డి(Deputy Mayor Marepally Surender Reddy) తెలిపారు. 9వ డివిజన్ క్రిస్టియన్‌పల్లి ప్రాంతంలో స్థానిక ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేసిన నూతన బోర్ మోటార్‌ను సోమవారం డిప్యూటీ మేయర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వేసవిని దృష్టిలో ఉంచుకుని నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నూతన బోర్లు, మోటార్ల ఏర్పాటు పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ హైదవి, వరుణ్‌గౌడ్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు. నూతన బోర్ మోటార్ అందుబాటులోకి రావడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తూ డిప్యూటీ మేయర్ ఎంఎస్ఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
