న్యాయ విద్యార్థుల వాదనకు కొత్త బలం

22-09-2026 | 07:00pm

వెంకటాపూర్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (Telangana Legal Students Association)జిల్లా అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన న్యాయ విద్యార్థి జన్ను నవీన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు తెలంగాణ లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాలు నాయక్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి సతీష్‌ లు నవీన్‌ కు నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. న్యాయ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు సామాజిక, న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని, విద్యార్థులు తమ హక్కులు, బాధ్యతలు, చట్టాలపై అవగాహన పెంచుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని, న్యాయ విద్యార్థుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి ఈ సందర్భంగా నవీన్ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు