21 August, 2026 | 4:40 PM

Breaking News

నీటి వనరుల వినియోగంపై రైతులను ప్రోత్సహించండి   •   శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •  

షావుకారు జానకి మరణవార్త ఎంతో బాధ కలిగించింది: NTR

21-08-2026 03:47 PM

ప్రముఖ నటి షావుకారు జానకి(Veteran Actress Sowcar Janaki Passes Away) 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఆసుపత్రిలో చేరిన ఆమె, శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. షావుకారు జానకి మరణ వార్త ఎంతో బాధ కలిగించిందని జూనియర్ ఎన్టీఆర్(Nandamuri Taraka Rama Rao) పేర్కొన్నారు. షావుకారు జానకి భారత సినీ రంగంలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. జానకి సినీ ప్రయాణం.. ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు. షావుకారు జానకి ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ ప్రార్థించారు. జానకి కుటుంబసభ్యులకు ఎన్టీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఎక్స్ లో పోస్టు చేశారు.