చరిత్రకు సాక్ష్యంగా కోటగుళ్లు

03-10-2026 | 04:42pm

కాకతీయుల శిల్పకళకు అబ్బురపడిన గ్రూప్‌- 1 గ్రూప్ -2 అధికారులు

గణపురం,అక్టోబర్ 03 (విజయక్రాంతి): నాటి కాకతీయుల చరిత్రకు సాక్ష్యంగా కోటగుళ్లు దేవాలయ(Kotagullu Temple) సముదాయాలు నిలుస్తాయని శిక్షణ పొందుతున్న గ్రూప్ -1, గ్రూప్-2 అధికారులు అన్నారు. గణపురం మండల(Ganapuram Mandal) కేంద్రంలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడం కాకతీయుల కళావైభవానికి(Artistic Splendour of the Kakatiyas) ప్రతీకగా నిలిచిన శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లను హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి(Marri Channa Reddy Human Resource Development Institute, Hyderabad) కేంద్రంలో శిక్షణ పొందుతున్న 180 మంది గ్రూప్-1 గ్రూప్-2 అధికారుల బృందం శుక్రవారం  సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయ చారిత్రక విశిష్టతను తెలుసుకున్నారు. కాకతీయుల కాలం నాటి అద్భుత శిల్పకళ, ఆలయ నిర్మాణశైలి, రాతి శిల్పాల సౌందర్యాన్ని చూసి అబ్బురపడ్డారు. ఇంతటి అపురూపమైన చారిత్రక సంపదను చూసే అవకాశం కలగడం ఆనందంగా ఉందని, కోటగుళ్ల శిల్పసంపద అద్భుతమని కొనియాడారు. ఆలయ చారిత్రక విశిష్టతను సీనియర్ జర్నలిస్ట్ తాళ్లపల్లి యాదగిరి గౌడ్ అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పర్యటక శాఖ నుండి సూర్యకిరణ్ , తాళ్లపల్లి యుగంధర్ గౌడ్, పురవస్తు శాఖ సెక్యూరిటీ నల్లగొండ రాజు గౌడ్ రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు